కలెక్టర్ ఆకస్మిక తనిఖీ – ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అభ్యర్థుల నైపుణ్యాల పరిశీలన..!
14/April/2026 22:06
Share:
డ్రైవర్ శిక్షణపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ – ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అభ్యర్థుల నైపుణ్యాల పరిశీలన..! క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి : యలమంచిలి కోర్ట్ జంక్షన్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన అభ్యర్థులకు డ్రైవర్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.యలమంచిలి కోర్ట్ సమీపంలోని అంబేద్కర్ గురుకులాల్లో ఏర్పాటు చేసిన శిక్షణ వేదికలను ఆయన సందర్శించారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థుల పనితీరును అంచనా వేసేందుకు కలెక్టర్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఇతర ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు.అభ్యర్థుల డ్రైవింగ్ నైపుణ్యం, ట్రాఫిక్ నియమాల పాటింపు, భద్రతా ప్రమాణాలపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు.ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని యువత తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని సూచించారు.