హరిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా కాండ్రేగుల రామసదాశివరావు నామినేషన్
18/November/2026 20:31
Share:
రైతు, కార్మిక, ప్రజాసంఘాల హరిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా హరిపాలెంలో కాండ్రేగుల రామ సదాశివ నామినేషన్ వేయడం జరిగింది. నిత్యం 30 ఏళ్లుగా రైతు సంఘం నాయకుడిగా మన ప్రాంతంలో రైతులు కూలీలు కార్మికుల సమస్యల పరిష్కారానికి అగ్రభాగాన ఉన్నారు గతంలో ఉప సర్పంచ్ గా ఉన్న కాలంలో గ్రామానికి 60 వేల మంచినీటి ట్యాంకు నిర్మాణానికి కృషి చేశారు అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు పూర్తిగా శిథిలమైతే దాన్ని పునర్నిర్మాణం కోసం పెద్ద ఎత్తున పోరాడారు రోడ్డు విస్తరణలో భూములు ఇల్లు షాపులు కోల్పోతున్న నిర్వాసితులకు టిడిఆర్ బాండ్ లకు కు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేసి వారి తరపున న్యాయపోరాటం నిర్వహిస్తున్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాండ్రేకుల రామ సదాశివ గారికి ఓటు వేసి గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు . ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శంకర్రావు, సిపిఎం కన్వీనర్ ఆర్ రాము, మండల కమిటీ సభ్యులు కే సోము నాయుడు ,గంగిరెడ్డి నారాయణమ్మ, సరగడం కన్నునాయుడు ,బుద్ధ రంగారావు, బొడ్డేడ రామ్ కుమార్ ,కాండ్రేగుల బాబురావు ,కాండ్రేగుల రామ అప్పారావు,అది బాబు, సత్తిబాబు, కోటి, పుష్పలత, మారిశెట్టి వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.