అనకాపల్లిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభం

అనకాపల్లిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభం

24/May/2026 19:12    Share:   

అనకాపల్లి పట్టణంలోని 83వ డివిజన్ పరిధిలోగల వేల్పులవీధి, సీతారామ కళ్యాణమండపం , పార్క్ సెంటర్ వరకు 
ఆపరేషన్ క్లీన్ స్వీప్ రాష్ట్ర పరిశుభ్రత లక్ష్యంగా 23 మే నుంచి 20 జూన్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు *శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారు
 డిప్యుటీ సియం *శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్* గార్ల పిలుపు మేరకు 
మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు *శ్రీ కొణతాల రామకృష్ణ గారు* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, అనకాపల్లి నియోజవర్గం, టీడీపీ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ గార్ల ఆదేశాలతో మొదటిగా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ 7 కార్యాలయం నుంచి శనివారం నాడు ఉదయం *ఆపరేషన్ క్లీన్ స్వీప్* కార్యక్రమం నిర్వహించారు
అనకాపల్లి జీవీఎంసీ ఇంచార్జీ జోనల్ కమిషనర్ తులసిలక్ష్మి, 83వ డివిజన్ కూటమి పార్టీ ఇంచార్జ్ లు బొద్ధపు ప్రసాద్, మంగ ఈశ్వర్ పాల్గొని ఆ ప్రాంత రోడ్లు చీపిరి పట్టి శుభ్రపరిచారు...
అనంతరం *జీవీఎంసీ జోనల్ ఇంచార్జ్ కమిషనర్ లక్ష్మీ తులసి మాట్లాడుతూ*
 పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో అధికారులు అందరూ కూడా కృషి చేస్తున్నారని తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, ప్రజా ప్రదేశాలు చెత్తరహితంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు ఆపరేషన్ క్లీన్ స్వీప్ స్వర్ణఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల రోజులపాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలోనే జిల్లా స్థాయి అధికారుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల వరకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు 
*ఈ కార్యక్రమంలో* 
83వ డివిజన్ కూటమి పార్టీ నాయకులు వాకాడ బాబు, గొర్లి శేఖర్, కుసుమ, కొణతాల గణేష్, ఎస్. భానుచందర్ (అఖి), షేక్ రియాజ్, దొండా నాగు వేల్పులవీధి ప్రాంత పెద్దలు, మరియు అనకాపల్లి జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్, 83వ డివిజన్ జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ మాడుగుల అప్పారావు, సచివాలయం కార్యవర్గ సెక్రటరీలు, ఆర్.పిలు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter