
రాంబిల్లి, జులై 25: మండలంలోని మూలజంప గ్రామంలో ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన – పునర్వవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల భీమా పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అనకాపల్లి జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా వరి సాగు చేస్తున్న రైతులందరూ ఈ పథకంలో ఎకరానికి రూ.84 ప్రీమియం చెల్లించి ఆగస్టు 15వ తేదీలోగా భీమా చేసుకోవాలని సూచించారు.
రైతులు ఆధార్ కార్డు, భూమి పాస్ బుక్-1బి, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్తో లింక్ ఉన్న ఫోన్తో మీసేవ కేంద్రాల్లో గానీ, pmfby.gov.in వెబ్సైట్ లేదా క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా గానీ ప్రీమియం చెల్లించవచ్చునని తెలియజేశారు.
మూలజంప గ్రామ రైతుల సౌకర్యార్థం సోమవారం మీసేవ కేంద్రం వారు ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సి. సుమంత తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవుడు, వీఏఏ రాజ్ కుమార్, గ్రామ రైతులు పాల్గొన్నారు.