అనకాపల్లి తేగాడ:
విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించి, వారి విద్యాభ్యాసానికి చేయూతనందించే ఉద్దేశంతో తేగాడ గ్రామంలో స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గౌరవ మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు (ఎమ్మెల్యే) శ్రీ కొనతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందజేశారు. ఈ కిట్లలో భాగంగా స్కూల్ బ్యాగులు, పాఠ్యపుస్తకాలు, షూస్, బెల్ట్లు తదితర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదువుకోవాలని పిలుపునిచ్చారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. [
1]
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తేగాడ గ్రామ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి కార్యకర్తలు, తల్లిదండ్రులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.