యలమంచిలి/పేట బయ్యవరం పాఠశాలలో ఎండీఎం నిర్వాహకులకు విరాళం
యలమంచిలి, ఆగస్టు 18: పేట బయ్యవరం ఎంపీపీ పాఠశాలలో ఎండీఎం నిర్వాహకులకు వంట పనిముట్లను ఉచితంగా అందజేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.వి. ధనలక్ష్మి మరియు వంట సిబ్బందికి ఈ పనిముట్లు అందజేయడం జరిగింది. ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన పెదపూడి డానియల్, డీఎస్సీ 2025 పరీక్షలలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ పీజీటీ టీచర్గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు సుమారు 4,000 రూపాయల విలువైన మిక్సీ మరియు కుక్కర్ పనిముట్లను పాఠశాల ఎండీఎం ఏజెన్సీ వారికి అందజేశారు.
ఈ పనిముట్లను విద్యార్థుల పేరిట డానియల్ తల్లి కొండమ్మ ఏజెన్సీ వారికి హస్తగతం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు బొడ్డేడ సత్యనారాయణ, ఏజెన్సీ ప్రతినిధులు చిట్టెమ్మ మరియు ఈదరాడ నాగలక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మరియు పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ, "విద్యార్థుల అభ్యున్నతికి మరియు సమాజ సేవకు ఇలాంటి విశిష్టమైన సేవలు మరింత కొనసాగాలని ఆశిస్తున్నాము" అని తెలియజేసి, విరాళం అందించిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు.