అనకాపల్లి. విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి..
14/March/2026 14:19
Share:
అనకాపల్లిలో సీఐటీయూ,ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన.విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్.. క్రైమ్ అనాలసిస్:A. Srinivasa Rao,అనకాపల్లి,జిల్లా ఇన్చార్జి, అనకాపల్లి: ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలోని నెహ్రూ చౌక్ వద్ద సీఐటీయూ (CITU), ఏఐఎస్ఎఫ్ (AISF) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం విద్యార్థుల పట్ల అనుసరిస్తున్న విధానాలను వారు తీవ్రంగా తప్పుబట్టారు. నిరసనకారులు ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లు: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను తక్షణమే పెంచాలి.హాస్టళ్లలో మెయింటెనెన్స్ నిధులు పెంచి, అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ప్రభుత్వ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్,వాచ్‌మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే పూర్తి స్థాయిలో విడుదల చేయాలి.పీజీ విద్యార్థుల ఉన్నత చదువులకు శాపంగా మారిన జీవో 77ను (GO 77) తక్షణమే రద్దు చేయాలి.పీపీపీ (PPP) విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి.