
అనకాపల్లి పట్టణంలోని ఏఎంసీ కాలనీ ప్రజల ఆశలు మరోసారి చిగురిస్తున్నాయి. కాలనీలో పూడిగుడిసెల్లో జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలకు ఆనాటి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకొని ఫ్లాట్ల రూపంలో గృహాలు నిర్మించి ఎన్నో కుటుంబాలకు స్థిర నివాసాన్ని కల్పించారు. ఆయన చేపట్టిన ఆ గృహ నిర్మాణ కార్యక్రమం ఇప్పటికీ కాలనీ ప్రజల మదిలో నిలిచిపోయిందని స్థానికులు గుర్తు చేస్తున్నారు.అయితే అనంతరం వచ్చిన ప్రజాప్రతినిధుల కాలంలో కాలనీ అభివృద్ధి, మరమ్మతుల విషయంలో సరైన చర్యలు కనిపించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 192 కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో వెయ్యికి పైగా ఓటర్లు, దాదాపు 1500 మందికి పైగా జనాభా ఉన్నప్పటికీ, మౌలిక వసతుల అభివృద్ధి, డ్రైనేజీ, రోడ్లు, భవనాల మరమ్మతులు వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని కాలనీ వాసులు పేర్కొంటున్నారు.బూత్ నెంబర్ 171 పరిధిలో ఉన్న ఈ కాలనీ ప్రజలు ఇప్పుడు మరోసారి తమ ఆశలను ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ గారిపైనే పెట్టుకున్నారు. ఆయన మళ్లీ ప్రత్యేక దృష్టి సారించి కాలనీ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకంతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.