యలమంచిలి: జాతీయ రహదారి కూడళ్లలో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టే ఉద్దేశంతో, యలమంచిలి మండలం ములకలాపల్లి గ్రామంలోని మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సిమెంట్ ఫ్యాక్టరీ) యాజమాన్యం సామాజిక బాధ్యతగా (CSR) పోలీస్ శాఖకు రోడ్ స్టాపర్లను విరాళంగా అందజేసింది,
యలమంచిలి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనుంజయ్ మరియు ఎస్.ఐ శ్రీ ఉపేంద్ర గారి విన్నపం మేరకు, సుమారు రూ. 1,50,000/- ఖర్చుతో తయారు చేయించిన 25 రోడ్ స్టాపర్లను ఈ రోజు ఫ్యాక్టరీ ప్రతినిధులు పోలీసులకు అందజేశారు.ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యూనిట్ హెడ్ శ్రీ బి. రామస్వామి మాట్లాడుతూ.. రహదారి భద్రతలో భాగంగా పోలీసుల అభ్యర్థన మేరకు వీటిని అందించామని, ఇవి వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రమాదాల నివారణకు తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ యూనిట్ హెడ్ శ్రీ బి.రామస్వామి గారితో పాటు సీనియర్ డి.జి.ఎమ్ (పి.అండ్.ఎ) శ్రీ ఎల్.శ్రీనివాసరావు, సి.ఎస్.ఒ శ్రీ డి. వెంకటరావు, యలమంచిలి సి.ఐ శ్రీ ధనుంజయ్ మరియు రూరల్ ఎస్.ఐ శ్రీ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.