గౌరీ విద్యానికేతన్ హైస్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

గౌరీ విద్యానికేతన్ హైస్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

21/June/2026 15:46    Share:   

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పి. విజయ
న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న వేడుకలు
ఎల్లమంచిలి, 
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని Yogandhra 2026 పురస్కరించుకొని ఎల్లమంచిలి పట్టణంలోని గౌరీ విద్యానికేతన్ హైస్కూల్లో యోగా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక కోర్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పి. విజయ గారు, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) శ్రీమతి జి. స్పందన గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యోగా శిబిరంలో ప్రముఖ యోగా ఇన్స్ట్రక్టర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పలు రకాల ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి ప్రక్రియలను న్యాయమూర్తులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ప్రదర్శించారు.
నిత్య జీవితంలో యోగా భాగం కావాలి:
కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పి. విజయ గారు మాట్లాడుతూ.. "ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక అద్భుతమైన మార్గం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయాలి. చిన్ననాటి నుంచే యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు" అని ఆమె పిలుపునిచ్చారు.
ఉత్సాహంగా పాల్గొన్న బార్ అసోసియేషన్:
బార్ ప్రెసిడెంట్ పి.వి. రమణ గారి సారథ్యంలో స్థానిక న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. నిరంతరం కేసుల ఒత్తిడితో ఉండే న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి యోగా ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గౌరీ విద్యానికేతన్ హైస్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
Breaking News

Subscribe our Newsletter