ఓటర్ల మ్యాపింగ్: వేగవంతం చెయ్యాలి.ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఓటర్ల మ్యాపింగ్: వేగవంతం చెయ్యాలి.ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి

02/July/2026 09:47    Share:   

#ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ బుధవారంలోగా 40 శాతం చేయాలి
#ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ నూరుశాతం పూర్తి చేయాలి
#ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ పనులు బుధవారంలోగా 40 శాతం చేయాలని జిల్లా .కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.  ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 కార్యక్రమం ప్రగతిపై మంగళవారం కలెక్టర్ ఈఆర్ఓ లు, ఏ ఈఆర్ఓ లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ   ఎన్యూమరేషన్ ఫారాలను నూరుశాతం పంపిణీని వెంటనే పూర్తి చేయాలనీ, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.  ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఎన్నికల విధులతో సమాన ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని, ఈఆర్ఓ లు, ఏ ఈఆర్ఓలు  ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.   ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ లో వెనుకబడిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.  పోలింగ్ బూత్ స్థాయి అధికారులు, పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్ లతో సమావేశాలు నిర్వహించి సమావేశపు మినిట్స్ ఫోటోలతో సహా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. 
ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ,  ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్,  స్వర్ణ గ్రామ/వార్డ్ సచివాలయాలు ప్రత్యేక అధికారి నాయుడు, ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, బిఎల్ఓ లు, ప్రభృతులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter