IPL బెట్టింగ్‌పై అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ కఠిన హెచ్చరిక

IPL బెట్టింగ్‌పై అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ కఠిన హెచ్చరిక

30/March/2026 22:09    Share:   

 
అనకాపల్లి, మార్చి 30, 2026
ఐపీఎల్ (IPL) సీజన్ ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై అనకాపల్లి జిల్లా ఎస్పీ (SP) తుహిన్ సిన్హా, ఐపీఎస్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.మార్చి 29న జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, బెట్టింగ్ రాకెట్లను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఆన్‌లైన్ బుకీలు, బెట్టింగ్ నిర్వాహకులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను (Special Teams) ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు బెట్టింగ్‌కు పాల్పడినా లేదా ప్రోత్సహించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ముఖ్యంగా యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు..
Breaking News

Subscribe our Newsletter