SIR కార్యక్రమం వేగవంతమే లక్ష్యం.ఏటికొప్పాకలో ఎంపీడీవో దీపిక ప్రత్యేక సమీక్ష
06/July/2026 21:44
Share:
SIR కార్యక్రమం వేగవంతమే లక్ష్యం.. ఏటికొప్పాకలో ఎంపీడీవో దీపిక ప్రత్యేక సమీక్ష – సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం...!
అనకాపల్లి జిల్లా, (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో కొనసాగుతున్న SIR కార్యక్రమం పురోగతిపై ఎలమంచిలి ఎంపీడీవో దీపిక ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో కార్యక్రమం ఎంతవరకు పూర్తయిందనే అంశంపై అధికారులతో సమగ్రంగా చర్చించి, మిగిలిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు (BLOలు), బీఎల్‌ఏలు (BLAలు) సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి అర్హులూ మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీడీవో ఆదేశించారు. కార్యక్రమాన్ని మరింత వేగంగా పూర్తి చేసేందుకు అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. గ్రామ ప్రజల సహకారంతో నిర్ణీత గడువులోపు SIR కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడమే లక్ష్యమని ఆమె తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పారదర్శకంగా, సమగ్రంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గ్రామ కార్యదర్శి కె. గిరిప్రసాద్, సచివాలయ సిబ్బంది, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.