ప్రైవేట్ ఆసుపత్రుల ఓవర్‌బిల్లింగ్‌కు అడ్డుకట్ట… కేంద్రం కీలక నిర్ణయం!

ప్రైవేట్ ఆసుపత్రుల ఓవర్‌బిల్లింగ్‌కు అడ్డుకట్ట… కేంద్రం కీలక నిర్ణయం!

26/April/2026 07:39    Share:   

క్రైమ్ అనాలిసిస్ – టివిఎస్ ప్రకాష్:
దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెరుగుతున్న అధిక ఛార్జీలు, ఓవర్‌బిల్లింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా చికిత్సలో వాడే మెడికల్ పరికరాలపై (Medical Devices) అధిక లాభాల దోపిడీని నియంత్రించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
మెడికల్ పరికరాలపై ధరల నియంత్రణ
ప్రభుత్వ దర్యాప్తుల్లో ఆసుపత్రులు సిరంజీలు, గ్లౌజులు, కాన్యులా వంటి సాధారణ వస్తువుల నుంచి పేస్ మేకర్లు, హార్ట్ వాల్వ్‌ల వరకు అసలు ధర కంటే 10 నుంచి 30 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది. దీనిని అరికట్టేందుకు ట్రేడ్ మార్జిన్‌పై పరిమితి విధించాలనే నిర్ణయం తీసుకుంది.
జాతీయ వైద్య ధరల నియంత్రణ బిల్లు – 2026
వైద్య ఖర్చులను నియంత్రించేందుకు కేంద్రం కొత్త బిల్లును పరిశీలిస్తోంది.
స్వతంత్ర కమిషన్ ఏర్పాటు: అన్ని ఆసుపత్రుల్లో చికిత్స, పరీక్షలు, ఇంప్లాంట్ల ధరలను నిర్ణయించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటవుతుంది.పారదర్శకత తప్పనిసరి: ఆసుపత్రులు రేట్ చార్ట్స్ ప్రదర్శించడం, ప్రతి ఖర్చు విడిగా చూపించే ‘ఐటమైజ్డ్ బిల్లులు’ ఇవ్వడం తప్పనిసరి అవుతుంది.
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం కఠిన అమలు
చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణను బలోపేతం చేయడానికి సవరణ బిల్లులు తీసుకొస్తున్నారు.
ప్రయోజనాలు సర్జరీ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పెరుగుదలకు నియంత్రణ అధిక బిల్లింగ్‌పై ఫిర్యాదు చేసే అవకాశం రోగులు అన్యాయంగా అధిక బిల్లులు వసూలు చేసినప్పుడు Pharma Sahi Dam యాప్ ద్వారా లేదా డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై భారీ జరిమానాలు విధించడం, అవసరమైతే లైసెన్స్ రద్దు చేసే చర్యలు తీసుకోనున్నట్లు కేంద్రం హెచ్చరించింది.
Breaking News

Subscribe our Newsletter