నోవోపోర్ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదం లో గాయాలైన కార్మికులను ఆదుకోవాలి, సిఐటియు
14/March/2026 17:05
Share:
అచ్చుతాపురం సెజ్ నోవోపో ర్ ఫార్మా పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్ పైప్ లైన్ నుంచి డి మిథైల్ సల్ఫేట్ వాయువులు విడుదలై తీవ్ర అస్వస్థకు గురైన కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించి కార్మికుల కుటుంబాలను అదుకోవాలని సిఐటియూ డిమాండ్ చేస్తున్నది. నిన్న జరిగిన సంఘటన అత్యంత గోప్యంగా ఉంచి అనకాపల్లి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికులను సైతం చూడటానికి వీలు లేకుండా ఆసుపత్రి ,పరిశ్రమ యాజమాన్యం ఆంక్షలు విధించింది,ఒకవైపు భద్రత వారోత్సవాలు పేరుతో పరిశ్రమల ముందు బ్యానర్లు కట్టి హడావుడి చేస్తున్న పరిశ్రమ యాజమాన్యాలు పరిశ్రమంలో భద్రత ప్రమాణాలు పాటించడంలో తీవ్ర లోపాలు జరుగుతున్నాయి లాభాలే పరమాధిగా యాజమాన్యాలు కార్మికుల భద్రత గురించి పట్టించుకోవడం లేదు వెంటనే ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని గాయాల పాలైన కార్మికలకు మెరుగైన వైద్య సేవలు అందించి నష్టపరిహారం ఇవ్వాలని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేసి కార్మికులకు భద్రత కల్పించాలని అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆర్ రాము,జి దేముడు నాయుడు, అచ్చుతాపురం కన్వీనర్ కే సోము నాయుడు, రాంబిల్లి కన్వీనర్ చందక రామకృష్ణ కోరారు .