జాతీయ లోక్ అదాలత్,1479 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్,1479 కేసుల పరిష్కారం

11/July/2026 21:36    Share:   

 
యలమంచిలి : స్థానిక కోర్టుల సముదాయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ పి. విజయ, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ జి. స్పందన, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. రమేష్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ లోక్ అదాలత్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో సివిల్, క్రిమినల్ పి ఎల్ సి విభాగాలకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మొత్తం 1479 కేసులను కక్షిదారులు పరస్పర అంగీకారంతో, సామరస్యపూర్వక రాజీ మార్గంలో పరిష్కరించుకున్నారు. ఈ లోక్ అదాలత్ వేదిక ద్వారా ఇంత పెద్ద సంఖ్యలో కక్షిదారుల వివాదాలు సత్వరమే రాజీ మార్గంలో పరిష్కారం కాగా, కార్యక్రమంలో ఇతర స్థానిక న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.వి. రమణ, వైస్ ప్రెసిడెంట్ ఎల్.వి.ఆర్.కె. రావు, లోక్ అదాలత్ సభ్యులు డి. వెంకటరావు, ఏజీపీ డి. నూకరాజు, టి. నూతన్ రాజు హాజరయ్యారు.
Breaking News

Subscribe our Newsletter