అసోం: భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఏఎన్-32 (AN-32) రవాణా విమానం శనివారం ప్రమాదానికి గురైంది. అసోంలోని జోర్హాట్ మిలిటరీ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయిన వెంటనే ఈ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానం సురక్షితంగా రన్‌వేపై దిగిన తర్వాతే ఈ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించడాన్ని గమనించిన వెంటనే ఎయిర్‌బేస్ రక్షణ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అత్యవసర సేవల బృందాలు మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి లేదా ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.