అనకాపల్లి , స్వచ్చంద బుద్ధ ధమ్మ దీక్ష ...

అనకాపల్లి , స్వచ్చంద బుద్ధ ధమ్మ దీక్ష ...

11/March/2026 13:43    Share:   

అనకాపల్లి తేదీ.14.03.2026,శనివారం డా..బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ డా..బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ భవన ప్రాంగణములో ఉదయం 10.30 గంటల నుండి స్వచ్చంధ ధమ్మ దీక్ష 
అనకాపల్లి నెహ్రూ చౌక్ లో గల బుద్ధుని విగ్రహం వద్ద స్వచ్చంద బుద్ధ ధమ్మ దీక్ష పునరుద్దీపన 2026 ఆహ్వానకరపత్రములు విడుదల..
ఈ దినం అనకాపల్లి సిద్దార్ధ సోషల్ సర్వీస్& కల్చరల్ అసోసియేషన్, అధ్యక్షులు బల్లానాగభూషణము ఆధ్వర్యములో అనకాపల్లి నెహ్రూచౌక్ లో గల గౌతమబుద్ధుని విగ్రహం వద్ద తేదీ.14.03.2026, శనివారం డా..బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ డా..బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ భవన ప్రాంగణములో ఉదయం 10.30 గంటల నుండి స్వచ్చంధ ధమ్మ దీక్ష పునరుద్దీపన -
2026 కార్యక్రమాన్ని సుమారు 4 వేలమంది సభ్యులతో జరిగే ఈ ఆహ్వాన కరపత్రములను సిద్దార్ధ అసోసియేషన్ అధ్యక్షులు బల్లానాగభూషణము చేతులమీదుగా విడుదలచేశారు.ఈ సందర్భముగా బల్లా నాగభూషణం మాట్లాడుతూ  ఈ పునరుద్దీపన 2026 స్వచ్చంద ధమ్మ దీక్ష స్వీకరణ మహోత్సవం లోరాష్ట్రంలో గల అంబేడ్కరీయులు, బుద్దిస్ట్ సొసైటీ సభ్యులు, బౌద్ద ఉపాసకులు, 
బౌద్ద అభిమానులు సుమారు 4 వేలమంది పాల్గొంటారని ఈ కార్యక్రమములో సభ్యులు స్వచ్చంద బుద్ధ ధమ్మ దీక్ష స్వీకారము చేస్తారని, ఈ కార్యక్రమములో ధమ్మ పతాక ఆవిష్కరణ, ధమ్మ దీక్ష అనుగ్రహము, ధమ్మ ఉపదేశం వంటి కార్యక్రమాలు ఉంటాయని కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పూజ్య బౌద్ద బిక్షువు భాంతే ఆంధ్ర అనాలయో గారు పాల్గొ0టారని అలాగే ఇతర బౌద్ద ప్రతినిధులు, అంబేద్కర్ ప్రతినిధులు  అతిథులుగా పాల్గొంటారని అన్నారు.ఈ కరపత్రం ల విడుదల కార్యక్రమం లో జిల్లా బుద్దిస్ట్ సొసైటీ అధ్యక్షులు పల్లా బాబ్జీ , కార్యదర్శి పందిరి దయాల్ రాజు, సిద్దార్ధ అసోసియేషన్, అధ్యక్షులు బల్లానాగభూషణము, కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శి రొబ్బి మల్లేశ్వరరావు, సభ్యులు బొడ్డు సోమరాజు, అయ్యగారి వెంకట రమణ మూర్తి, బొట్ల బుజ్జిపాల్గొన్నారని అలాగే బల్లానాగభూషణము మాట్లాడుతూ ఈ పునరుద్దీపన 2026 కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా  బౌద్ధఅభిమానులు, అంబేడ్కరీయులు, బుద్దిస్ట్ సొసైటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు..
Breaking News

Subscribe our Newsletter