మార్చ్ 8 న నూకాంబిక అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం 5 నుండి ఘనంగా ప్రారంభ వేడుకలు ప్రకటించిన ఎమ్మెల్యే కొణతాల
01/March/2026 07:41
Share:
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, భక్తులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి నూతన దేవాలయ ప్రారంభోత్సవం మరియు అమ్మవారి దర్శన కార్యక్రమాలు వచ్చే మార్చి నెల 8 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం లో ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో లో మాజీ మంత్రి ,స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ముఖ్య విషయాలు ప్రకటించారు.2022లో ప్రారంభమైన అమ్మవారి ఆలయ పునర్ నిర్మాణం 4 సంవత్సరాల్లో పూర్తయి ఈ ఏడాది అమ్మవారికొత్త అమావాస్య జాతర కిసిద్ధం అయిందని చెప్పారు. ఈ సందర్భంగా వచ్చే నెల మార్చి 8వ తారీఖున ఉదయం 10:58 నిమిషాలకి ముహూర్తం నిర్ణయించబడ్డదని తెలియజేశారు. అనంతరం అందరికీఅమ్మవారు దర్శనం ఇస్తారని చెప్పారు. గత ఏడాది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా ప్రకటించబడిన సందర్భంగా ప్రజల సహకారంతో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నెల రోజులు పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. మార్చి 5వ తారీఖున అమ్మవారి పసిడి కలశాల ఊరేగింపు సాయంత్రం 4 గంటలకు మొదలవుతుందని, మార్చి 6,7తారీఖులలో చండీయాగం ఇతర హోమ కార్యక్రమాలు జరుగుతాయని మార్చి 8 తారీకు ఉదయం 10 :58 నిమిషాలకి పూర్ణాహుతి తో కలశ స్థాపన జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రిని, దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా మంత్రి, ఇంచార్జి మంత్రి ఉత్తరాంధ్ర శాసనసభ్యుల్ని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు గర్భాలయ ప్రాంగణం అభివృద్ధి చేయడం జరిగిందని తర్వాత ప్రాంగణం చుట్టూ మార్పులు చేయాలని చుట్టూ కాంపౌండ్ వాల్ మరికొన్నిఅభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయించడం జరిగిందని చెప్పారు.దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపామని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థాన పునః ప్రతిష్ట,రాజగోపుర ప్రతిష్ట మరియుమహాసంప్రోక్షణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి అమ్మవారి ఉత్సవరధాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగ శ్రీను (గొల్ల బాబు) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి యాళ్ల శ్రీధర్,గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర,ఆలయ ధర్మకర్తలు దాడి రవికుమార్, పొలిమేర ఆనంద్, కొడుకుల శ్రీకాంత్ మరియు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.