విశాఖపట్నం అంతర్ జిల్లాల క్రీడా పోటీలలో అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ శాఖ సిబ్బంది ప్రతిభ - 126 పతకాల కైవసం

విశాఖపట్నం అంతర్ జిల్లాల క్రీడా పోటీలలో అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ శాఖ సిబ్బంది ప్రతిభ - 126 పతకాల కైవసం

22/March/2026 17:53    Share:   

 
అనకాపల్లి:
ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు ఈ నెల 16, 17 మరియు 18 తేదీలలో విశాఖపట్నం కొమ్మాది లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) స్టేడియంలో నిర్వహించిన అంతర్ జిల్లాల క్రీడా పోటీలలో అనకాపల్లి జిల్లా కు చెందిన పలువురు సిబ్బంది ఉత్సాహంగా ఆటల పోటీలలో పాల్గొని తమ తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి (126) పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన సిబ్బందిని జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్, అనకాపల్లి వారు అభినందించారు.
సిబ్బంది తమ రోజువారీ ఉద్యోగ విధులను నిర్వహించడానికి ఫిట్నెస్ ను కాపాడుకోవడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఉద్యోగి తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగంగా చేసుకోవాలని మరియు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో జరగబోయే క్రీడల పోటీలలో పాల్గొని అనకాపల్లి జిల్లా కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరినట్లు అనకాపల్లి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి వి.సుధీర్ తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter