*విజ్జి స్టేడియం, విజయనగరం |
విజయనగరం జిల్లా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షులు, విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు విజ్జి స్టేడియంలో జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ శ్రీ K.V.L.N. రాజు గారు, సెక్రటరీ శ్రీ పెనుమత్స సీతారామరాజు గారు, ఇతర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజ్జి స్టేడియంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంతో పాటు, భవిష్యత్తులో క్రీడాకారులకు మరింత మెరుగైన శిక్షణ, సాధన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమగ్రంగా చర్చించారు.
ముఖ్యంగా మహిళా క్రికెట్కు ప్రోత్సాహం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన మహిళా క్రీడాకారిణులకు స్పోర్ట్స్ దుస్తులను స్పాన్సర్ చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న మహిళా క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సమావేశంలో తీర్మానించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన బాలికలు, మహిళా క్రీడాకారిణులు సరైన అవకాశాలు, ప్రోత్సాహం లేక తమ ప్రతిభను నిరూపించుకోలేకపోతున్నారు. అలాంటి వారిని గుర్తించి, తగిన శిక్షణ, ప్రోత్సాహం, వేదిక కల్పించడం ద్వారా మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం.
మహిళా క్రీడాకారిణులకు సమాన అవకాశాలు కల్పిస్తూ, జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు రాణించే క్రీడాకారిణులను తయారు చేయడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా నిరంతర కృషి చేస్తామని ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు స్పష్టం చేశారు.
మందపాటి సూర్యనారాయణ రాజు క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ ఆయన పేరు మీద పెట్టండి