కళాకారుల కల సాకారం.. ఏటికొప్పాకకు పర్యాటక వైభవం!

కళాకారుల కల సాకారం.. ఏటికొప్పాకకు పర్యాటక వైభవం!

28/August/2026 21:39    Share:   

ఎలమంచిలి, ఆగస్టు 28 (CA న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
హస్తకళల థీమ్ పార్కుకు శంకుస్థాపన
ఏటికొప్పాక హస్తకళలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మక హస్తకళల థీమ్ పార్కుకు ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్.ఎస్. రావత్ ఐఏఎస్, రవి పటాన్ శెట్టి ఐఏఎస్, పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం హస్తకళాకారులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీ విధానాన్ని పరిశీలించి, కళాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించే అంశాలపై చర్చించారు. థీమ్ పార్క్ నిర్మాణంతో కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఏటికొప్పాకను పర్యాటక గ్రామంగా అభివృద్ధి చేసేందుకు మార్గం సుగమం కానుంది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కళాకారులు, గ్రామ ప్రజలు  పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter