డిసెంబర్ 3 వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ నిలిపివేత
అనకాపల్లి, అక్టోబర్ 18:
స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని డిసెంబర్ 3వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ తెలిపారు.జిల్లాలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 3 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు విస్తృత బందోబస్తు, శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో నిమగ్నమై ఉన్నారని తెలిపారు.ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అధికారులు కచ్చితంగా పాటించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ మార్పును గమనించి పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్
శ్రీనివాస్ అప్పికొండ