హరిపాలెం – అందలపల్లి శ్రీ భగీరథి అమ్మవారి విశేష అలంకరణ
04/September/2026 18:58
Share:
యలమంచిలి /హరిపాలెం/శ్రీ కృష్ణాష్టమి శ్రావణమాసం 4వ శుక్రవారం సందర్భంగా హరిపాలెం–అందలపల్లి కొండపై ఉన్న శ్రీ భగీరథి అమ్మవారిని 1001 తమలపాకులు, నెమలి పింఛాలతో అత్యంత వైభవంగా అలంకరించారు. ప్రతి తమలపాకుపై గంధంతో పవిత్ర “ఓం”కారం రాసి, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి విశేష అలంకరణ చేసి భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే… అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ భగీరథి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.