విద్యార్థుల భవిష్యత్తుకు బ్రాండిక్స్ అండ – దొరైస్వామి చేతుల మీదుగా కిట్ల పంపిణీ

విద్యార్థుల భవిష్యత్తుకు బ్రాండిక్స్ అండ – దొరైస్వామి చేతుల మీదుగా కిట్ల పంపిణీ

25/June/2026 17:07    Share:   

దొరైస్వామి చేతుల మీదుగా బ్రాండిక్స్ ఉద్యోగుల పిల్లలకు జూనియర్స్ స్కాలర్‌షిప్ – విద్యా సామగ్రి పంపిణీ
 
అచ్యుతాపురం, జూన్ 25 క్రైమ్ న్యూస్ ప్రతినిధి :
అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ సంస్థలో జూనియర్స్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థలో ఒక సంవత్సరం పూర్తి చేసిన ఉద్యోగుల పిల్లలకు విద్యా ప్రోత్సాహకంగా సంస్థ ప్రతినిధి దొరైస్వామి చేతుల మీదుగా పాఠశాల బ్యాగులు, నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, జ్యామితి పెట్టెలు, రంగుల సామగ్రి తదితర పాఠశాల అవసరాలకు ఉపయోగపడే విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
ఉద్యోగుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూనియర్స్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన పాఠశాల సామగ్రిని అందించడం ద్వారా వారి విద్యా ప్రయాణానికి ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దొరైస్వామి మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువులో రాణించి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉద్యోగుల పిల్లల భవిష్యత్తు అభివృద్ధికి సంస్థ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో సంస్థ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter