గోదావరి జలాలకు ఘనంగా ‘జలహారతి’

గోదావరి జలాలకు ఘనంగా ‘జలహారతి’

04/September/2026 18:56    Share:   

గోదావరి జలాలకు ఘనంగా ‘జలహారతి’ ఇచ్చిన నియోజకవర్గ ఇంచార్జ్ & ఏపీ ఆర్ డి సి చైర్మన్  ప్రగడ నాగేశ్వరరావు
యలమంచిలి నియోజకవర్గ రైతాంగ సుదీర్ఘ స్వప్నం నెరవేరింది. గోదావరి ఎడమ కాలువ (కుడుకాలువ) నీరు  ప్రాంతానికి చేరుకోవడంతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని యలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్  ప్రగడ నాగేశ్వరరావు  యలమంచిలి నియోజకవర్గంలో  టౌన్ పరిధిలో పెద్దపల్లి గ్రామం, వెంకటాపురం మరియు యలమంచిలి రూరల్ పరిధిలో షేకలపాలెం  కాలువ వద్ద గంగమ్మ తల్లికి, గోదావరి జలాలకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల నడుమ ‘జలహారతి’ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు  మీడియాతో మాట్లాడుతూ
ఎంతోకాలంగా సాగునీటి కోసం నిరీక్షిస్తున్న మన ప్రాంత రైతులకు ఈ గోదావరి జలాలు కొత్త ఊపిరి పోశాయి. ఈ నీటి రాకతో యలమంచిలి నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది.* ఈ కాలువ నీటి వల్ల కేవలం పంట పొలాలకే కాకుండా, నియోజకవర్గంలోని పలు గ్రామాల తాగునీటి ఎద్దడి తీరుతుంది. భూగర్భ జలాలు కూడా విశేషంగాఈ కాలువ నీటి వల్ల కేవలం పంట పొలాలకే కాకుండా, నియోజకవర్గంలోని పలు గ్రామాల తాగునీటి ఎద్దడి తీరుతుంది. భూగర్భ జలాలు కూడా విశేషంగా పెరుగుతాయి.* చివరి ఆయకట్టు రైతు వరకు ప్రతి ఎకరాకూ సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రైతాంగ సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత.ఈ కార్యక్రమంలో యలమంచిలి మండల పార్టీ ప్రెసిడెంట్ నానాజీ, అచ్చుతాపురం మండల పార్టీ ప్రెసిడెంట్ లాలం భరత్ , యలమంచిలి రూరల్ మండల పార్టీ ప్రెసిడెంట్ సన్యాసినాయుడు , జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు రాజు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి శివ అప్పారావు,  ప్రధాన కార్యదర్శి ఆడారి ఆదిమూర్తి , జిల్లా అధికారి ప్రతినిధి దాడి రమేష్, క్లస్టర్ ఇంచార్జ్ బొడ్డపు శ్రీనివాసరావు, దాంట్ల వెంకటస్వామి, సేనాపతి నాగేశ్వరరావు,  శ్రీను, రమణబాబు , ఎరిపిళ్ళి చిట్టిబాబు, యలమంచిలి టౌను జనసేన పార్టీ అధ్యక్షులు బద్ధపు శ్రీనివాసరావు, నమ్మి రమణ, మజ్జి రామకృష్ణ బిశెట్టి చిన్నారావు, ఐటీడీపి అశోక్,సేనాపతి తులసిరామ్,యల్లపు శ్రీనివాస్ రావు,ఎల్లపు గోపి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిపార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter