[విద్యార్ధులకు డ్రగ్స్ నిరోధము ఫై అవగాహనా కార్యక్రమము
దాడి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ,అటానముస్, లో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు ఈగల్ డిపార్టుమెంటు, వైబ్రంట్స్ అఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 , 1000 కిలోమీటరులు , సంయుక్తముగా నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర (తిరుపతి నుండి విశాఖపట్నం వరకు ) అనకాపల్లి జిల్లా దాడి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కు చేరుకుంది. ఈసందర్భాముగా డైట్ యాజమాన్యం సైకిల్ యాత్ర టీం కు సాదర స్వాగతం పలికారు. విద్యార్ధులకు ప్రత్యెక అవగాహనా కార్యక్రమము ఏర్పాటు చేసారు .
ఈ కార్యక్రమముని ఉద్దేశించి డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు .ముక్యముగా యువత ,విద్యార్ధులు డ్రగ్స్ కు బానిసలూ కాకుండా వుండాలని కోరారు .డ్రగ్స్ తీసుకున్న, కలిగివున్న చట్టపరముగా కటిన శిక్షలు ఎదురుకోనవలసి వస్తుంది.కావునా ముక్యముగా విద్యార్ధులు డ్రగ్స్ జోలికి పోవద్దని బంగారు భవిష్యత్తుని కోల్పోవద్దని సూచించారు. యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలు ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయని, విద్యార్థులు అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ - 1972 కు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమము టి ప్రభాకర్ బాబు ,అడిషనల్ ఎస్ పి ,శ్రీమతి డాక్టర్ టి కల్యాణి సి ఐ ఈగల్ డిపార్టుమెంటు ,శ్రీమతి ఏం .శ్రావని ,డి ఎస్ పి ,అనకాపల్లి , కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ వైకుంఠ రావు, మిస్టర్ విజయ్ కలాం , వైబ్రంట్స్ సబ్ కలాం ఆర్గనైజేషన్ ఫౌండర్ , వైబ్రంట్స్ ఆఫ్ కలాం సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ రవిరాజు, నియోజకవర్గ కోఆర్డినేటర్ రమణ మరియు జి ప్రేమ్ కుమార్,సి ఐ ,జి అశోక్ కుమార్ సి ఐ ,అనకాపల్లి . సైకిల్ యాత్ర ద్యారా చక్కటి స్ఫూర్తిదాయక సందేశాన్ని అందిస్తున్న విజయ్ కలాము ని పోలీస్ అధికారులు , డైట్ యాజమాన్యం అభినందించారు . విద్యార్ధులతో ప్రతిజ్ఞా అనంతరం 100 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన అందరి నీ ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమము లో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వివి ఫణి బాబు గారు, అసోసియేట్ డీన్ అడ్మినిస్ట్రేషన్ ఏం .పద్మాకర్ ,వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్, డి ఎల్ సి సి, డివిసి వాలంటీర్లు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడంతో కార్యక్రమం ముగిసింది.