అనకాపల్లి టు అచ్చుతాపురం రోడ్డు విస్తరణ నిర్వాసితులకు న్యాయం చేయాలి 

అనకాపల్లి టు అచ్చుతాపురం రోడ్డు విస్తరణ నిర్వాసితులకు న్యాయం చేయాలి 

19/June/2026 19:51    Share:   

అనకాపల్లి నుండి అచ్చుతాపురం రోడ్డు విస్తరణలో భూములు, ఇల్లు షాపులు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని ఈరోజు హరిపాలెం గ్రామం పరిధిలో నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాసితుల సంఘం అధ్యక్షులు కాండ్రేగుల రామ సదాశివరావు , ఎస్ బ్రహ్మాజీ, కూండ్రపు సోమునాయుడు  మాట్లాడుతూ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టo ప్రకారం నగదు రూపంలో పరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా  ఆర్ అండ్ బి ,రెవెన్యూ అధికారులు నిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేస్తూ తీవ్ర మానసిక ఆందోళనకు  గురి చేస్తున్నారు ఈ రోడ్డు విస్తరణలో 1200 మంది నష్టపోతున్నారని రోడ్డు విస్తరణకు తమ విలువైన భూములు ఇచ్చి త్యాగం చేస్తూ సహకరిస్తున్న నిర్వాసితులకు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది టిడిఆర్ బాండ్లు వద్దని ముక్తకంఠంతో నిర్వాసితులందరూ వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం నిర్వాసితులు ఆమోదం లేకుండా వాళ్లు ఇష్టానుసారం రోడ్డుకు ఇరువైపులా పనులు చేపడుతుంది నిర్వాసితులు ఆమోదం లేకుండా పనులు చేపట్టడం చట్ట వ్యతిరేకం వెంటనే అధికారులు నిర్వాసితులతో సమావేశం నిర్వహించి వీరి సమస్యలు పరిష్కరించాలని కోరారు లేదంటే నిర్వాసితులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసిత నాయకులు  కె బాబురావు, ఎక్స్ ఆర్మీ కె గణపతి రావు, ఎం రమణమ్మ, డి అప్పల నరసమ్మ, ఎం వెంకట అప్పారావు, ఎం సత్తిబాబు, ఎం పారునాయుడు, కె కన్నబాబు  తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter