సత్య సాయి బాబా ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని మజ్జిగ చలివేంద్రం ఘనంగా ఏర్పాటు.

సత్య సాయి బాబా ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని మజ్జిగ చలివేంద్రం ఘనంగా ఏర్పాటు.

25/April/2026 07:49    Share:   

శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా ఆరాధన దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తి, సేవా భావం మరోసారి ప్రతిబింబించింది...!
మజ్జిగ చలివేంద్రం ప్రారంభం – బీదలకు భోజనాల పంపిణీ..!!
క్రైమ్ అనాల్సిస్ – టివియస్ ప్రకాష్ :
అనకాపల్లి జిల్లా నక్కపల్లి రహదారి పక్కన ఉన్న శ్రీశ్రీ శ్రీ భక్త వీరాంజనేయ స్వామి వారి మందిర ఆవరణలో, సత్య సాయి బాబా ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని మజ్జిగ చలివేంద్రం ఘనంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని కక్కిరాల సురేష్ ఆధ్వర్యంలో నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి చేతుల మీదుగా  ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 50 మంది నిరుపేదలకు అన్నదానం నిర్వహించి, సేవా స్పూర్తిని చాటుకున్నారు.అదేవిధంగా నక్కపల్లి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) సీనియర్ ఉత్తమ ప్రతినిధి కక్కిరాల సురేష్ సేవలను స్థానిక ప్రముఖులు ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.ఈ సేవా కార్యక్రమం ప్రాంతంలో ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను కూడా పెంపొందించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
Breaking News

Subscribe our Newsletter