ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

27/June/2026 08:53    Share:   

( క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
అనకాపల్లి జిల్లా ..అచ్యుతాపురం మండలంలోని ఎస్‌టిబిఎల్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఎలమంచిలి నియోజకవర్గంలోని ఏటికొప్పాక గ్రామానికి చెందిన లక్క బొమ్మల కళాకారులు ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
 
ఈ సందర్భంగా కళాకారులు తమ వృత్తికి సంబంధించిన సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరియు లక్క బొమ్మల తయారీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
 
అనంతరం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, ఏటికొప్పాక లక్క బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మన సాంప్రదాయ హస్తకళకు ప్రతీక అని అన్నారు. ఈ కళను పరిరక్షించడంతో పాటు కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
 
కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అపురూపమైన హస్తకళను భావితరాలకు అందించే బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొంటూ, ఏటికొప్పాక లక్క బొమ్మలకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Breaking News

Subscribe our Newsletter