యలమంచిలి: జనసేన పార్టీ ఉద్యమి సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్యెల్యే సుందరపు విజయకుమార్ సోదరుడు జనసేన పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల సమన్వయకర్త సుందరపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం రాంబిల్లి మండలంలోని వెంకటాపురం గ్రామంలోని జనసేన పార్టీ కేంద్రీయ కార్యాలయంలో ఆయన పలు వురు ఆ పార్టీ నేతలుతో కలిసి జనసేన ఉద్యమి సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, పారదర్శక పాలన, అవినీతి రహిత వ్యవ స్థను ప్రజల్లోకి బలంగా తీసువెళ్ళాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ రాంబిల్లి, అచ్యుతాపురం మండలశాఖల అధ్యక్షులు పప్పల నూకన్నదొర, బైలపూడి శ్రీరామదాసు, పార్టీ సీనియర్ నాయకులు జనపరెడ్డి శ్రీనివాసరావులు, పార్టీ ఉద్యమ సభ్యుత్వ న మోదు కార్యక్రమం యొక్క అవస్యకతను తెలియజేశారు. పార్టీ అధినే పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు ఈ కార్యక్రమంను ప్రతి ష్టాత్మకంగా ప్రారంభించడం జరిగిందన్నారు. పార్టీ ఉద్యమి సభ్యుత్వాలను 100 శాతం విజయవంతంగా పూర్తి చేయాలని పార్జీశ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గబ్బర్సింగ్, నాని, పలువురు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.