కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
అఖిల భారత యువజన సమాఖ్య ఏలూరు జిల్లా కన్వినర్ తొర్లపాటి రాజు
అఖిల భారత యువజన సమాఖ్య (AIYF )అధ్యర్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ విధానాల కారణంగా యువత నిరుద్యోగం, ఉపాధి, వలసలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) ఏలూరు జిల్లా కన్వినర్ ఆందోళన వ్యక్తం చేసారు . ప్రతి సంవత్సరం కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు, మరోవైపు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడంలో విఫలమయ్యాయని విమర్శించిరు,పోటీ పరీక్షల్లో జాప్యం, పేపర్ లీకులు, పరీక్షల రద్దు, నియామక ప్రక్రియలో అవకతవకల వల్ల నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్, 4 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, కొత్త పరిశ్రమల ఏర్పాటు వంటి హామీలను వెంటనేఅమలుచేయాలని డిమాండ్ చేసారు
ఏలూరు జిల్లా కన్వినింగ్ కమిటీ మెంబెర్ కురెళ్ల వరప్రసాద్ మాట్లాడుతూ
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేసి, MSME రంగాన్ని బలోపేతం చేసి స్థానిక యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలనీ పేపర్ లీకులు, పరీక్షల అవకతవకలను అరికట్టి నియామక ప్రక్రియను పారదర్శకంగానిర్వహించాలని యువతకు ఉపాధి హక్కుకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని 2025 మెగా DSCలో పేపర్ లీకేజీ, మెరిట్ జాబితా అక్రమాలు,స్పోర్ట్స్ కోటాదుర్వినియోగంపై హైకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలుతీసుకోవాలని అన్నరు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా AIYF మాజి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ నీట్ ఎగ్జామును బాధ్యత రాష్ట్రాలకు అప్పగించాలి అని పి పి పి విధానాన్ని రద్దుచేసి మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను ఆపాలి అని నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య యువజన సమాఖ్య మాజీ నాయకులు భజంత్రి శ్రీనివాస్,నాగం అచ్చుత్, పార్టీ సభ్యులు బళ్ళ కనకదుర్గరావు, మావూరి విజయ, గొర్లి స్వాతి,ఉప్పులూరి కేశవ, అమర్, రమేష్ యువజన సంఘo సభ్యులు అంబేద్కర్ పిట్టా చందు కొండ శివమని జీజ్జువరపు సురేంద్ర, సన్నీ, కొండేటి విక్రమ్,k నవీన్, t గిరి, సాయి,s సురేష్ ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు సిద్దు పాల్గొన్నారు