వెంకటాపురంలో ఆదివారం జనసేన పార్టీ జనసేన కార్యకర్తలతో సమావేశం
23/February/2026 07:33
Share:
రాంబిల్లి మండలంలోని వెంకటాపురంలో ఆదివారం జనసేన పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నాలుగు మండలాల జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని, అన్ని అభివృద్ధి పనులను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని తెలిపారు. అలాగే ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా నేరుగా ఆయనకు తేలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ముఖ్య నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.