విజయనగరం, సెప్టెంబర్ 20:
విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 27వ వార్షిక మహాసభకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో వారు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. జర్నలిస్టులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, తాను గతంలో ఈనాడు దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన గౌరవం, సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
క్రైమ్ అనాలిసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు