కాపు సంఘాల ఐక్యత,సామాజిక అభివృద్ధిపై,కాపు సంఘాల నాయకులు, సమావేశం!

కాపు సంఘాల ఐక్యత,సామాజిక అభివృద్ధిపై,కాపు సంఘాల నాయకులు, సమావేశం!

02/October/2026 18:39    Share:   

క్రైమ్ అనాలసిస్ | టీవీఎస్ ప్రకాష్ (స్పెషల్ రిపోర్టర్) :

అడ్డరోడ్డు, అక్టోబర్ 2: కాపు సంఘాల ఐక్యత, సామాజిక అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ లక్ష్యంగా శుక్రవారం అడ్డరోడ్డులోని శ్రీవాణి జూనియర్ కళాశాలలో నిర్వహించిన కాపు సంఘాల సమావేశం ఘనంగా జరిగింది. కాపు సంఘాల నాయకులు, పెద్దలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘాల ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సమావేశానికి శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు, డైరెక్టర్ కర్రి వెంకట రమణ, ప్రముఖ ప్రజా నాయకులు అన్నం వెంకటరావు, అద్భుతమైన సారద్యం వహించారు.

యలమంచిలి ప్రజా నాయకుడు శెలంశెట్టి సూర్యప్రకాష్, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ ద్వారపురెడ్డి నాగేశ్వరరావు, యలమంచిలి పట్టణ కన్వీనర్ టీవీఎస్ ప్రకాష్, బీజేపీ ప్రముఖ నాయకులు నక్కా శివశంకరరావు, (మాజీ సైనికుడు), యలమంచిలి ప్రముఖ నాయకుడు అడపా శేషగిరితో పాటు పలువురు కాపు సంఘాల నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాపు సంఘాల మధ్య ఐకమత్యం, పరస్పర సహకారం, సమన్వయం పెంపొందించుకోవాల్సిన అవసరంపై నాయకులు చర్చించారు. సామాజిక అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, యువతను ప్రోత్సహించడం, విద్యా, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడం, భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రజాప్రయోజన కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

కాపు సంఘాలన్నీ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని నాయకులు పిలుపునిచ్చారు. సంఘాల మధ్య ఐక్యత, సమన్వయం పెంపొందితే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ సమాజ సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

సమావేశం సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం జైజై నినాదాలతో ప్రాంగణం సందడిగా మారింది. కాపు సంఘాల ఐక్యత కోసం సమావేశాన్ని నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు. కార్యక్రమానికి సహకరించిన సంఘాల పెద్దలు, నాయకులు, ప్రముఖులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

“కాపు సంఘాల ఐక్యతే మన బలం.. సమైక్యతతోనే అభివృద్ధి సాధ్యం” అనే సందేశంతో సమావేశం ముగిసింది. భవిష్యత్తులో మరిన్ని ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపట్టి సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు.
Breaking News

Subscribe our Newsletter