అనకాపల్లిలో ఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవం..

అనకాపల్లిలో ఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవం..

13/November/2026 15:48    Share:   

అనకాపల్లి, నవంబర్ :

స్థానిక మెయిన్ రోడ్ లో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో బ్యాంకు 108వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్యాంకు ప్రాంగణాన్ని రంగురంగుల బెలూన్లు, పూలతో అందంగా అలంకరించారు. ముందుగా చీఫ్ మేనేజర్ సూర్య కుమారి ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఖాతాదారులు కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ సూర్య కుమారి మాట్లాడుతూ... 1919లో స్థాపించబడిన యూనియన్ బ్యాంక్ నేడు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటిగా ఎదగడం వెనుక ఎంతోమంది ఖాతాదారుల నమ్మకం, సిబ్బంది కృషి ఫలితమే ఉందని అన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని, రుణాలు, డిజిటల్ సేవలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. బ్యాంకు అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ప్రముఖ వర్తకులు వంకాయల ఈశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకు సేవలు పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిన్న వ్యాపారులకు, రైతులకు, మహిళలకు యూనియన్ బ్యాంకు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు.

ఈ వేడుకల్లో బ్యాంకు ఉద్యోగులు రవికుమార్, ఈశ్వరరావు, ఏ.వి.జి.రాజు, కాండ్రేగుల హరికృష్ణ, జి.శిరీష, శరగడం భవాని, ఆడారి రాము, మాలతి, అప్రైజర్ కృష్ణ, మునేశ్వరరావు తదితరులు, పలువురు ఖాతాదారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter