వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్

వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్

13/September/2026 19:58    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 

ఏలూరు జిల్లా ప్రజలందరికీ మరియు పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి, అధికారులకు మరియు వారి కుటుంబ సభ్యులకు విజ్ఞాన దాత, విఘ్నాధిపతి అయిన శ్రీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు.
ఈ సందర్భముగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే వినాయకుని కృపతో ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు మరియు ఆయురారోగ్యాలు పరిమళించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రజలందరూ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పిలుపునిస్తున్నాను.
పండుగ వేళ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను, మార్గదర్శకాలను విధిగా పాటించాలి.
ముఖ్యంగా విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించడం, డీజే సౌండ్ సిస్టమ్స్‌ను పరిమిత శబ్దాలతో వినియోగించడం మరియు ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం మన అందరి బాధ్యత.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.ఈ వినాయక చవితి పండుగ ఏలూరు జిల్లా ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరి జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, 
Breaking News

Subscribe our Newsletter