నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు కలెక్టర్ వెల్లడి.
06/October/2026 07:26
Share:
అనకాపల్లి, అక్టోబర్ 5:
జిల్లాలోని పరవాడ, కోటపాడు, నర్సీపట్నం, అచ్యుతాపురం, నక్కపల్లి మండలాల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూములను నిబంధనల ప్రకారం పరిశీలించి తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు.ప్రత్యేక డ్రైవ్ ద్వారా అర్హత కలిగిన భూ యజమానుల రికార్డులను పరిశీలించి, జిల్లా రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. అర్హత ఉన్న మిగిలిన భూముల కేసులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాసులు అప్పికొండ