ఏటికొప్పాక: మండల పరిధిలోని 17 మంది పంచాయతీ కార్యదర్శులు, ఆరిత రాయబారులకు స్వచ్ఛతపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా SWPC షెడ్‌లో నిల్వ ఉన్న చెత్తతో సంపద సృష్టించే విధానంపై శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీమతి వి. దీపిక, పంచాయతీ విస్తరణ అధికారి కె. గిరి ప్రసాద్ రావు, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కె. వరహాలు, స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.