25వ రోజుకు చేరిన జంఝావతి సాధన దీక్షలు

25వ రోజుకు చేరిన జంఝావతి సాధన దీక్షలు

16/October/2026 19:50    Share:   

జంఝావతి పూర్తిస్థాయి ప్రాజెక్టు నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ జంఝావతి ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో 22-09-2026 నుండి పార్వతీపురంలో ప్రారంభమైన సాధన దీక్షలు ఈరోజుతో 25వ రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా సాధన సమితి నాయకులు మాట్లాడుతూ..17-10-2026, శనివారం ఉదయం 9 గంటలకు పార్వతీపురం మార్కెట్ యార్డ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు తలపెట్టిన భారీ రైతు ర్యాలీని ఆయకట్టు రైతులంతా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ ర్యాలీకి అన్ని ప్రజా సంఘాలు, వర్తక సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు సంఘీభావం తెలిపాయని తెలిపారు. రేపటి ర్యాలీ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు."ఈ కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షులు, కార్యదర్శి మరియు ఆయకట్టు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter