చెస్ జిల్లా స్థాయి పోటీలో తుమ్మపాల చిన్నారికి ప్రత్యేక బహుమతి

చెస్ జిల్లా స్థాయి పోటీలో తుమ్మపాల చిన్నారికి ప్రత్యేక బహుమతి

18/October/2026 19:49    Share:   

చెస్ జిల్లా స్థాయి పోటీలో తుమ్మపాల చిన్నారికి ప్రత్యేక బహుమతి
నిర్వాహకులు, ప్రముఖుల అభినందనలు

అనకాపల్లి :

పసి వయస్సులోనే చదరంగంపై ఆసక్తి పెంచుకుని తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటున్న తుమ్మపాల గ్రామానికి చెందిన చిన్నారి దాడి ధీరజ్ నందన్ జిల్లా స్థాయి చెస్ పోటీల్లో ప్రత్యేక బహుమతి అందుకుని ప్రతిభ చాటాడు.

అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీల్లో ధీరజ్ నందన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. చదరంగంలో ఏకాగ్రత, ఆలోచనా శక్తి, సమయస్ఫూర్తి ఎంత ముఖ్యమో తన ఆటతీరుతో నిరూపిస్తూ ప్రత్యేక బహుమతిని అందుకున్నాడు.

చిన్న వయస్సులోనే చెస్ వంటి మేధో క్రీడపై ఆసక్తి పెంచుకుని జిల్లా స్థాయి పోటీల్లో గుర్తింపు పొందడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు, ప్రముఖులు, మేధావులు, గ్రామ పెద్దలు తదితరులు ధీరజ్ నందన్ ను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో చెస్ వంటి క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నారులను క్రీడల వైపు ప్రోత్సహించాలని పలువురు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సాహం అందించాలని ఆకాంక్షించారు.

తుమ్మపాల గ్రామానికి చెందిన ధీరజ్ నందన్ సాధించిన ఈ గుర్తింపు గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.

Breaking News

Subscribe our Newsletter