హరిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా కాండ్రేగుల రామ సదాశివరావు..
14/November/2026 21:43
Share:
హరిపాలెం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎం, కార్మికులు, కర్షకులు బలపరిచిన హరిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా సిపిఎం సీనియర్ నాయకులు కాండ్రేకుల రామ సదాశివరావు పోటీ చేస్తారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. శంకరరావు ప్రకటించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ హరిపాలెం ప్రాంతంలో రైతులు, కార్మికులు, దళితులు, చేతి వృత్తి దారులు, అనేక ప్రజా సమస్యల పైన పనిచేశారని రోడ్డు విస్తరణలో భూములు, ఇల్లు ,షాపులు కోల్పోతున్న నిర్వాసితుల తరఫున టీడీఆర్ బాండ్లకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్న కాండ్రేగుల రామ సదాశివ గారిని ప్రజలు ఆదరించి హరిపాలెం పంచాయతీ అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము, సీనియర్ నాయకులు కర్రి అప్పారావు, సరగడం కనుమనాయుడు బాబురావు , రామ అప్పారావు ,కె.సోము నాయుడు, చేపల తాతయ్య తదితరులు పాల్గొన్నారు.