ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జనవాణి కార్యక్రమం..

ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జనవాణి కార్యక్రమం..

07/October/2026 22:01    Share:   

యలమంచిలి :

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 'జనవాణి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ప్రజల నుంచి నేరుగా వినతులు, అర్జీలను స్వీకరించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల అర్జీలపై తక్షణమే స్పందించిన ఆయన, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter