ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్గారి పర్యటన..*ఘన స్వాగతం పలికిన ఆర్టీసీ జోన్ 2 చైర్మన్,,

ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్గారి పర్యటన..*ఘన స్వాగతం పలికిన ఆర్టీసీ జోన్ 2 చైర్మన్,,

17/March/2026 18:56    Share:   

*కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు.
ఘన స్వాగతం పలికిన ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు గారు..
ఏలూరు, మార్చి 17:- ఏలూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం కార్యక్రమాల నిమిత్తం మంగళవారం ఏలూరుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు ఏలూరు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గౌరవ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు మంత్రి నాదెండ్ల గారికి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు గారు శాలువాతో సత్కరించి, పుష్పగుఛ్ఛం అందజేసి వారికి ఘన స్వాగతం పలికారు. ఇంకా స్వాగతం పలికిన వారిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కోటికలపూడి గోవిందరావు (చినబాబు)గారు , ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు , పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారు, జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, కైకలూరు ఎమ్మెల్యే శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారు, జేసి అభిషేక్ గౌడ్ గారు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ గారు, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి గారు, జనసేన నాయకులు నారా శేషు గారు, కొఠారు ఆదిశేషు గారు పలువురు ఉన్నతాధికారులు, కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
Breaking News

Subscribe our Newsletter