ఫిబ్రవరి 28 లోపు జీవన ప్రమాణ పత్రాల (లైఫ్ సర్టిఫికెట్స్) సమర్పణ తప్పనిసరి
24/February/2026 19:40
Share:
జిల్లా ఖజానా మరియు గణాంక అధికారి వి.ఎల్. సుభాషిణి. అనకాపల్లి, ఫిబ్రవరి 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ దారులందరూ తమ జీవన ప్రమాణ పత్రాలు (లైఫ్ సర్టిఫికెట్స్)ను 28/02/2026 తేదీ లోపు తప్పనిసరిగా సమర్పించవలసినదిగా జిల్లా ఖజానా మరియు గణాంక అధికారి వి.ఎల్. సుభాషిణి తెలిపారు. పెన్షన్ నిలిచిపోకుండా ఉండేందుకు, పెన్షన్ దారులు జీవన ప్రమాణ యాప్ ద్వారా తమ మొబైల్ ఫోన్ ద్వారా గాని, సమీప పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, ఉప ఖజానా కార్యాలయాలు లేదా జిల్లా ఖజానా కార్యాలయం ద్వారా గాని సకాలంలో జీవన ప్రమాణ పత్రాలను సమర్పించుకోవాలని సూచించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షన్ దారులు సంబంధిత ఖజానా అధికారులకు సమాచారం అందించిన పక్షంలో, అధికారులు వారి నివాసానికి వచ్చి జీవన ప్రమాణ పత్రాలను స్వీకరించే ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. అలాగే బయోమెట్రిక్ సమస్యలు ఎదురైన వారు నేరుగా సంబంధిత ఖజానా కార్యాలయంలో జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చని తెలిపారు. కావున పెన్షన్ దారులందరూ 28/02/2026 లోపు జీవన ప్రమాణ పత్రాలను సమర్పించి తమ పెన్షన్ సకాలంలో అందుకొనుటకు సహకరించవలసిందిగా జిల్లా ఖజానా మరియు గణాంక అధికారి కోరారు.