గడపగడపకు నదియా.. ప్రజల సమస్యలపై ఆరా! ఓటర్లను కలుస్తూ సమస్యల పరిష్కారానికి హామీ

గడపగడపకు నదియా.. ప్రజల సమస్యలపై ఆరా! ఓటర్లను కలుస్తూ సమస్యల పరిష్కారానికి హామీ

23/October/2026 20:54    Share:   

అనకాపల్లి: అనకాపల్లి 111వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలయ నదియా గడపగడపకు తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. మల్ల వీధి, చవితి వీధి, లోకా వారి వీధి, శాఖ వీధి తదితర ప్రాంతాల్లో ఓటర్లను కలుసుకుని వారి సమస్యలు, సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని నదియా హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో 111వ వార్డు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కోరుకొండ రాఘవతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్
శ్రీనివాసరావు అప్పికొండ
Breaking News

Subscribe our Newsletter