యలమంచిలి స్థానిక చెరువు వద్ద స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమం
19/April/2026 06:58
Share:
యలమంచిలి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం జరిగే కార్యక్రమంలో ఈనెల థీమ్ అయినటువంటి జల ధార- జల హారతి -అనే అంశంపై స్వచ్ఛత కార్యక్రమాలు శనివారం నాడు స్థానిక కొమ్మాయిగుండం చెరువు వద్ద పార్క్ లో చెరువు పరిసరాలలో చెత్తను తొలగించి చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శానిటేషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అనంతరం కమిషనర్ బి జె యస్. ప్రసాద్ రాజు మాట్లాడుతూ చెరువు పరిసరాలను మరియు పార్క్ ను పరిశుభ్రంగా ఉంచాలని చెరువుల్లో ఎటువంటి వ్యర్ధాలు వేసిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.అనంతరం మానవహారం గా ఏర్పడి అక్కడి వాకర్స్ ప్రజలు , మెప్మా , సచివాలయ సిబ్బంది చేత మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు స్వచ్ఛత ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం 13, సచివాలయాల పరిధిలో ఉన్న స్కూళ్లలో, కాలేజీల్లో పై పేర్కొన్న అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ పల్లా.శ్రీనివాసరావు, సిఎంఎం పద్మ ,మేనేజర్ విజయకుమార్ ,మెప్మా , మునిసిపల్ , సచివాలయ సిబ్బంది,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.