కైకలూరు శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు

కైకలూరు శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు

21/August/2026 20:51    Share:   

- కైకలూరు నియోజకవర్గం, మండవల్లి మండలం, పెనుమాక లంక గ్రామంలో ఘనంగా జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు..
- శ్రావణమాసంలో శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం సందర్భంగా కొత్తూరులోని శ్రీ కనకదుర్గ అమ్మవారికి విశేష పూజలు..- ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ప్రత్యేక దర్శనం, పూజలు..

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 

కైకలూరు, ఆగష్టు 21:- ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం, మండవల్లి మండలం, పెనుమాక లంక గ్రామంలో వెలసిన శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవస్థానం  నందు శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు శుక్రవారం ఘనంగా ప్రారంభమైనది. మూడు రోజుల పాటు ఈ మహోత్సవం కొనసాగుతోందని కమిటీ సభ్యులు తెలిపారు.. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ శ్రీ ఘంటసాల శ్రీనివాస రావు గారి ఆహ్వానం మేరకు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ గంగానమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ "భక్తి శ్రధ్ధలతో ఇంతా ఘనంగా గంగానమ్మ అమ్మవారి మహోత్సవాన్ని నిర్వహిస్తున్న కమిటి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ గంగానమ్మ , శ్రీ కనకదుర్గమ్మ అమ్మవార్లకి పూజ కైంకర్యాలు నిర్వహించాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సశ్యశ్యామలంగా పాలించాలనే ఆశయంతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలన్న సంకల్పంతో ఈరోజు ఈ పూజలు నిర్వహించాం. శ్రీ గంగానమ్మ, శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి సౌభాగ్యం కలగాలి" అని ఆకాంక్షించారు. అనంతరం కొత్తూరు లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నగర అధ్యక్షులు వీరంకిపండు, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, అగ్గాల శ్రీనివాస్, జనసేన రవి, వాసా సాయి, జగపతి మనోహరం స్వామి, గంగానమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter