పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించి అర్జీల సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100

పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించి అర్జీల సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100

01/March/2026 18:13    Share:   

నేడు కలెక్టరేట్ లో పి.జి.ఆర్.ఎస్, రెవిన్యూ క్లినిక్
అర్జీల సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100కు కాల్ చేసి తెలుసుకోవాలి
జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్
అనకాపల్లి (కలెక్టరేట్ ) మార్చి 01 : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్), రెవెన్యూ క్లినిక్ ల కార్యక్రమాన్ని నేడు మార్చి 02 వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంతో పాటు జిల్లాలో అన్ని మండల, డివిజన్ స్థాయి కార్యాలయాల లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఆదివారం ప్రకటనలొ పేర్కొన్నారు.పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించిన అర్జీల సమాచారం కోసం 1100 టోల్ ఫ్రీ నెంబర్ కు నేరుగా కాల్ చేసి తెలుసుకోవాలని అర్జీదారులకు కలెక్టర్ సూచించారు.పి జి ఆర్ ఎస్ కు హాజరు కాని అర్జీదారులు*Meekosam.ap.gov.in(మీ కోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు
      


జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, అనకాపల్లి
Breaking News

Subscribe our Newsletter