ప్రభుత్వ గుర్తింపులేని  విద్యాసంస్థలను సీజ్ చేయాలి,ఏఐఎస్ఎఫ్, డిమాండ్.

ప్రభుత్వ గుర్తింపులేని  విద్యాసంస్థలను సీజ్ చేయాలి,ఏఐఎస్ఎఫ్, డిమాండ్.

09/July/2026 07:11    Share:   

జిల్లా ఆర్ఐఓ ను  సస్పెండ్ చెయ్యాలి...
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు: 
జిల్లాలో గుర్తింపు లేకుండా నడుపుతున్న విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్న ఆర్ఐఓ యోహాన్ ను తక్షణం సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్, జిల్లా కార్యదర్శి కె.సిద్దు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నడుపుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్న ఆర్ఐవోను సస్పెండ్ చేయాలని కోరుతూ బుధవారం స్థానిక ఆర్ఐఓ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి శివకుమార్, సిద్దు మాట్లాడుతూ జిల్లాలో ప్రవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు యాజమాన్యాలు  విద్యార్థుల తల్లితండ్రులు నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా తల్లిదండ్రుల వద్ద నుండి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నా గాని చర్యలు తీసుకోవాల్సిన ఆర్ఐఓ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాల, విద్యాసంస్థలపై ఏటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుపుతున్న అటువంటి విద్యాసంస్థలపై సరైన పర్యవేక్షణ కూడా చెయ్యట్లేదాని ఆరోపించారు. ఈ విషయంపై ఏఐఎస్ఎఫ్, ఆధ్వర్యంలో పలుమార్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఐఓ యోహాన్ కు వినతిపత్రాలు అందించినా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. 
తక్షణమే ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న  విద్య సంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్య సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు చంటి,మహేష్, కుమార్,వరుణ్, ప్రభు,నాయకులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter